ఈ దెబ్బతో సునీతా కొడుకుకు క్రేజ్ దక్కడం ఖాయం..!

-

ఏ తల్లిదండ్రుల కైనా సరే తమ పిల్లలను ఉన్నత స్థానంలో చూడాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తూ ఉంటారు.. అందుకు తగ్గట్టుగానే తమ పిల్లలను సరైన మార్గంలో నడిపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సింగర్ సునీత కూడా తన కొడుకును హీరోగా చూడాలని గత కొన్ని సంవత్సరాలుగా ఆరాటపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంచి కథ దొరికితే ఖచ్చితంగా తన కొడుకును హీరోగా చేయాలని ఎన్నో కలలు కంటోంది. త్వరలోనే తన కొడుకును సినిమాలలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ.

నిన్న తన కొడుకు ఆకాష్ పుట్టినరోజు కాగా సరికొత్త ఫోటోషూట్ నిర్వహించి.. తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆకాష్ కి సంబంధించిన ఎన్నో ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇందులో ఆకాష్ హీరో కట్ అవుట్ తో మంచి బాడీ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా ఉన్నాడు. ఇండస్ట్రీలోకి వస్తే ఖచ్చితంగా క్లిక్ అవుతాడు అనే విధంగా ఫోటోషూట్ నిర్వహించడం గమనార్హం. సునీత తన కొడుకు ఫోటోలను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే .. “మరొక పక్క నిన్ను త్వరలోనే యాక్టర్ గా చూడాలని కోరుకుంటున్నాను నాన్న.. నీ కలలు సహకారం కావాలని మరింత ఆకాంక్షిస్తున్నాను” అంటూ పోస్ట్ చేసింది.

అసలే సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. ఇక ఈ విషయం పోస్ట్ చేయగానే ప్రతి ఒక్కరు కూడా ఆకాష్ ఏ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు? దర్శకుడు ఎవరు? హీరోయిన్ ఎవరు? అంటూ ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. అంతేకాదు మరి కొంతమంది ఆకాష్ సినిమాలలోకి వస్తే పక్కా సక్సెస్ అవడం ఖాయం అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. మొత్తానికైతే హీరో రేంజ్ లో ఉన్న ఆకాష్ ఏ దర్శకుడి ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెడతారో తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే సునీత షేర్ చేసిన ఈ ఫోటోలు వల్ల ఆకాష్ క్రేజ్ అమాంతం పెరిగిపోతుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version