ఫోన్‌లో మాట్లాడుతూ పాములపై కూర్చుంది.. తర్వాత ఏం జరిగిందంటే..!

-

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌ఫూర్‌కు చెందిన గీతా యాదవ్ అనే మహిళ థాయ్‌లాండ్ ఉన్న తన భర్త జై సింగ్ యాదవ్‌కు ఫోన్ కాల్ చేసింది. అయితే ఆమె చూసుకోకుండా తన బెడ్‌రూంలో బెడ్‌పై ఉన్న పాములపై కూర్చుంది. దీంతో ఆ పాములు ఆమెను కాటేశాయి.

మృత్యువు అనేది నిజంగా మనకు ఏ రూపంలో వస్తుందో తెలియదు. అది వచ్చినప్పుడు కూడా మనం ఏమీ చేయలేం. దురదృష్టం వెంటాడితే.. మన ప్రాణాలు ఎప్పుడైనా పోవచ్చు. సరిగ్గా ఆ మహిళకు కూడా.. పాపం.. అలాగే జరిగింది. అనుకోకుండా పాములపై కూర్చోవడంతో ఆమె వాటి కాటుకు బలై మృత్యు ఒడిలోకి చేరింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌ఫూర్‌కు చెందిన గీతా యాదవ్ అనే మహిళ థాయ్‌లాండ్ ఉన్న తన భర్త జై సింగ్ యాదవ్‌కు ఫోన్ కాల్ చేసింది. అయితే ఆమె చూసుకోకుండా తన బెడ్‌రూంలో బెడ్‌పై ఉన్న పాములపై కూర్చుంది. దీంతో ఆ పాములు ఆమెను కాటేశాయి. అయితే గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పాముల విషం శరీరమంతా వ్యాపించడంతో ఆమె మృతి చెందింది.

అయితే గీతా యాదవ్ మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వచ్చి చూశాక.. ఆమె బెడ్‌పై రెండు పాములు పెనవేసుకుని కలయికలో ఉండడాన్ని ఆమె కుటుంబ సభ్యులు చూశారు. దీంతో వారు కోపోద్రిక్తులపై ఆ రెండు పాములను చంపేశారు. కాగా గీతా యాదవ్ ఆ పాములు ఆ స్థితిలో ఉన్నప్పుడే వాటి మీద ఆమె చూసుకోకుండా కూర్చుని ఉంటుందని వైద్యులు తెలిపారు. ఏది ఏమైనా.. మరణం అంటూ రాసి పెట్టి ఉన్నాక.. దాని నుంచి ఎవరూ తప్పించలేరు కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version