ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని దర్శించుకునేందుకు వెళ్లి ఓ మహిళ డెలివరీ అయింది. ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వచ్చిన ఓ మహిళకు ఒక్కసారిగా పురిటి నొప్పులు… వచ్చాయి. దీంతో వెంటనే అక్కడే ఉన్న వెల్నెస్ ఆసుపత్రికి… ఆలయ కమిటీ సభ్యులు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఖైరతాబాద్ దర్శనానికి వచ్చిన ఆ గర్భిణీ స్త్రీ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన మహిళగా గుర్తించారు. ఆ మహిళ పేరు రేష్మ. ప్రస్తుతం ఆసుపత్రిలో తల్లి అలాగే కూతురు ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా.. ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని చూసేందుకు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.