Hyderabad Rains: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పటాన్చెరు, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, ఆల్వాల్, ముషీరాబాద్, ఖైరతాబాద్, పంజాగుట్ట ప్రాంతాల్లో జోరుగా వాన పడుతోంది. రహదారులన్ని జలమయం కావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. దింతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.

శేరిలింగంపల్లిలో 4 సెం.మీ, రామచంద్రపురంలో 3.5 సెం.మీ, కుత్బుల్లాపూర్‌లో 2.9 సెం.మీ, పటాన్చెరులో 2.9 సెం.మీ.. నమోదు అయింది. కూకట్‌పల్లిలో 2.7 సెం.మీ, షేక్‌పేట్‌లో 2.4 సెం.మీ, ముషీరాబాద్‌లో 2.3 సెం.మీ, కాప్రాలో 2.3 సెం.మీ వర్షపాతం నమోదు అయింది.