అత్తారింటికి వెళ్లాల్సిన అమ్మాయి హత్యకు సూత్రదారిగా మారిందా

-

వారం రోజుల్లో పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లాల్సిన అమ్మాయి.. ఒక హత్యకు సూత్రదారి అయ్యింది. కాబోయే భర్తను.. ప్రియుడితో చంపించింది. తర్వాత తనుకు ఏమీ తెలియదన్నట్లుగా నటించింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడడంతో అందరూ షాక్ అయ్యారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు శివార్లలో గఫార్ బేగ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. వారం రోజుల్లో పెళ్లి కావాల్సిన గఫార్ ను.. కత్తులతో దాడి చేసి గొంతుకోసి హత్య చేశారు. ఏ ఒక్కరితోను చిన్న గొడవ కూడా పడని అతన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందా అనీ గ్రామస్తులు ఆలోచనలో పడ్డారు. పోలీసులు రంగంలోకి దిగేసరికి అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గఫార్ కు జూన్ లో ఆళ్లగడ్డకు చెందిన రేష్మాతో పెళ్లి నిశ్చయమైంది. రేష్మకు శేఖర్ సింగ్ అనే యువకునితో ప్రేమలో ఉంది. గఫార్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆమె ఎలాగైనా అతన్ని అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియునితో కలసి కుట్ర పన్నింది. పథకంలో భాగంగా గఫార్ ను రేష్మ తన ఇంటికి పిలిపించుకుంది. తర్వాత గఫార్ అక్కడి నుంచి తిరిగి కందుకూరుకు బయల్దేరగానే..శేఖర్ సింగ్ కు సమాచారం ఇచ్చింది.

శేఖర్ సింగ్ తన స్నేహితులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, ఖాజా సహాయంతో అతన్ని హతమార్చేందుకు రోడ్డుపై కాపుకాశాడు. తర్వాత గఫార్ రాగానే.. కోటకందుకూరు దారిలో కత్తులతో పొడిచి గొంతు కోసి చంపేశారు.గఫార్ ను అడ్డు తొలగించుకోవాలని ముందే నిర్ణయించుకుంది రేష్మ. అందుకే అతన్ని పదే పదే ఇంటికి రమ్మని పిలిచింది. చివరకు ఇంటికి వచ్చిన గఫార్ ను తిరిగిరాని లోకాలకు పంపించేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version