ఇంట్లో నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్

-

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌ హమీపుర్‌లోని మౌదహా గ్రామంలో చోటుచేసుకుంది. మహిళపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

హమీర్​పుర్​ గ్రామానికి చెందిన బాధితురాలి భర్త.. మరో ప్రాంతంలో పనిచేస్తున్నాడు. దీంతో బాధితురాలు.. అత్తతో కలిసి ఉంటోంది. ఆగస్టు 11న నిద్రపోతున్న సమయంలో ఐదుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. మహిళ నిద్రిస్తున్న గదిలోకి వచ్చి.. ఆమెను బలవంతంగా మరో గదికి ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించగా.. చంపేస్తామంటూ తుపాకీతో బెదిరించారు. అనంతరం దుండగులు అక్కడినుంచి పరారయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో విషయం వైరల్ అవ్వడం చూసిన పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version