హాస్టల్లో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు లీక్

-

హాస్టల్ లో ఉన్న మహిళలు స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీసింది అదే హాస్టల్ లో ఉంటున్న ఓ మహిళ. అంతటితో ఆగకుండా తనకు పరిచయమైన ఓ వ్యక్తికి పంపించింది. ఆమెతో పాటు హాస్టల్ లో ఉంటున్న ఓ యువతి ఆ మహిళ సెల్ ఫోన్ పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం వార్డెన్ కు చెప్పగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో చోటుచేసుకుంది.

రామనాథపురం జిల్లా కముది ప్రాంతానికి చెందిన కాళేశ్వరి అనే 31 ఏళ్ల మహిళ మధురైలోని ఓ ప్రైవేటు లేడీస్‌ హాస్టల్‌లో ఉంటూ బీఈడీ చదువుతోంది. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన వైద్యుడు ఆసిక్‌తో పరిచయం ఏర్పడింది. కాళేశ్వరి తాను ఉంటున్న హాస్టల్లోని మహిళలు స్నానాలు చేసే వీడియోలు, ఫొటోలను తీసి వాట్సాప్‌లో ఆసిక్‌కు పంపుతూ ఉండేది. రెండు రోజుల క్రితం ఆమెతో పాటు గదిలో ఉంటున్న మరో మహిళ ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించగా అందులో ఫొటోలు, వీడియోలు కనిపించాయి.

కంగుతన్న ఆ మహిల.. ఈ విషయాన్ని వార్డెన్‌కు చెప్పింది. వార్డెన్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి ఆసిక్‌ను, కాళేశ్వరిని ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version