తెలంగాణలో రైతులు యూరియా కోసం ఎన్నో సాహసాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే లైన్లలో నిలబడుతున్నారు. అయినప్పటికీ యూరియా దొరకడం లేదు. యూరియా కోసం చాలామంది ఇబ్బందులు పడుతున్నారు గొడవలు పెట్టుకుంటున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని ఓ ఎరువుల దుకాణం వద్ద యూరియా కోసం లైన్లలో నిలబడ్డారు. అందులో ఇద్దరు మహిళలు ఒకరినొకరు ఘోరంగా కొట్టుకున్నారు. ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం వద్దకు ఇద్దరు మహిళలు యూరియా కోసం వచ్చారు.

అక్కడ ఆధార్ కార్డు నమోదు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆ మహిళలు ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని చెప్పులతో కొట్టుకుంటూ జుట్టు పట్టుకొని నడిరోడ్డుపైకి వచ్చి హంగామా చేశారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఇద్దరిని పట్టుకొని అక్కకి తీసుకెళ్లడంతో గొడవ సర్దుమనిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. యూరియా కోసం చాలా కష్టపడుతున్నామని యూరియా అందివ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
యూరియా కోసం మహిళలు ఫైటింగ్..
నడి బజార్లో జుట్లు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళ రైతులు. pic.twitter.com/8GUjyTckj9
— TV9 Telugu (@TV9Telugu) September 5, 2025