షాకింగ్ – సముద్రంలోని ఒసామా బిన్ లాడెన్ బయటకి…!!

-

ఒసామా బిన్ లాడెన్ గురించి తెలియని వాళ్ళు ప్రపంచంలో  ఎవరూ ఉండరు. కరుడుగట్టిన ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ లాడెన్. అమెరికాకి కంటి మీద కునుకు లేకుండా చేయడంలో కీలక పాత్ర పోషించిన లాడెన్. ఆ తరువాత అమెరికా అత్యంత వ్యూహాత్మక దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇప్పటి వరకూ బిన్ లాడెన్ ఎక్కడ ఉన్నాడో బయట ప్రపంచానికి తెలియదు. కానీ లాడెన్ ని హతమార్చిన తరువాత అతడిని సముద్రంలో పడేశామని అమెరికా ఆర్మీ వెల్లడించింది.  ఇప్పుడు ఊహించని విధంగా లాడెన్ సముద్రపు ఒడ్డున దొరికాడు….

ఏంటి షాక్ అవుతున్నారా, ఇది నిజమే లాడెన్ సముద్రపు ఒడ్డున దొరికాడు. అది కూడా ముఖమే దొరికింది. నమ్మలేక పోతున్నారా సరే అసలు విషయం ఏమిటంటే. ఇంగ్లాడ్ లోని ఈస్ట్ సక్సెస్ లో ఓ మహిళ తన పెళ్లి రోజు సందర్భంగా భర్త తో కలిసి సముద్రం వద్దకి వెళ్లి అక్కడ బీచ్ లో నడుస్తూ ఉంది. ఒక్క సారిగా అలల ధాటికి తన ముందుకు ఒక ఆల్చిప్ప కొట్టుకు వచ్చింది.

అది కాస్త వింతగా కనిపించడంతో తీసుకుని చూసి ఒక్క సారిగా షాక్ అయ్యింది. లాడెన్ పోలికలతో ఉన్న ఆ ఆల్చిప్ప చూడగానే ఆమె ఆందోళనకి లోనయ్యిందట. ఆమె భర్త జీసస్ లా ఉందని చెప్పగా కాదు ఇది లాడెన్ ముఖాన్ని పోలినట్లుగా ఉందని సోషల్ మీడియాలో పెట్టిందట.దాంతో ఇది అందరూ లాడెన్ తల అంటూ కామెంట్స్ పెట్టారట. కొందరైతే సముద్రంలో లాడెన్ శరీరాన్ని పడేసారు కాదా అందుకే లాడెన్ ఈ ఆల్చిప్పలోకి వచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారట. ఏది ఏమినా సరే ఈ ఆల్చిప్పలో లాడెన్ పోలిన ముఖం ఉండటంతో ఇది కాస్తా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version