కర్వాచౌత్ “స్త్రీల” పండుగ గురించి తెలుసా మీకు..!

-

ఏంది.. కర్వా.. అరె నోరు తిరుగుతలేదే.. కర్వాచౌతా? అదేం పండుగ. ఎక్కడ చేసుకుంటారు దీన్ని అని అంటారా? అవును.. ఈ పండుగ గురించి సౌత్ ఇండియన్స్‌కు ఎక్కువగా తెలియకపోవచ్చు కానీ.. నార్త్ ఇండియాతో సంబంధం ఉన్నవాళ్లకు కర్వాచౌత్ అంటే తెలుస్తుంది. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇది స్త్రీల పండుగ. అయితే.. ఈ పండుగ జరుపుకోవడానికి ఓ కారణం ఉంది. అదేంటి.. తెలుసుకోవాలనుందా.. అయితే పదండి..

భర్తలపై భార్యలకు ఉన్న ప్రేమను తెలియజేసేదే కర్వాచౌత్ పండుగ. ఈ పండుగ సమయంలో భర్తలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భార్యలు ఉపవాసం చేస్తారు. అంటే.. భార్యలకు తమ భర్తలపై ఎంత ప్రేమ ఉందో తెలియజేయడమే ఈ పండుగ ఉద్దేశం అన్నమాట. ఈ పండుగను మహిళలు ఎంతో ఆనందంగా జరుపుకున్నారంటే.. వాళ్లకు తమ భర్తల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నమ్ముతారు. వాళ్ల ప్రేమను తమ భర్తలకు తెలియజేయడం కోసమే ఈ పండుగను జరుపుకుంటారు. మరికొంతమంది మాత్రం ఈ పండుగ తమ సంప్రదాయమని.. అందుకే జరుపుకుంటామని చెబుతారు. దివాళి పండుగకు కొన్ని రోజుల ముందు ఈ పండుగను జరుపుకుంటారు. నార్త్ ఇండియాలోని పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో ఈ పండుగను మహిళలు ఘనంగా జరుపుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version