బెంగ‌ళూరు చేతిలో చిత్తుగా ఓడిన కోల్‌క‌తా

-

అబుధాబిలో బుధ‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 39వ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ చిత్తుగా ఓడింది. రాయ‌ల్ చాలెంజర్స్ బెంగ‌ళూరు బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో కోల్‌క‌తా త‌క్కువ స్కోరుకే ప‌రిమిత‌మైంది. దీంతో స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని బెంగ‌ళూరు ఆడుతూ పాడుతూ ఛేదించింది. కోల్‌క‌తాపై బెంగ‌ళూరు 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

మ్యాచ్‌లో కోల్‌క‌తా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 84 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ మోర్గాన్ మిన‌హా ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు. 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో మోర్గాన్ 30 ప‌రుగులు చేసి జ‌ట్టును ఆదుకునే య‌త్నం చేశాడు. కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్ నుంచి అత‌నికి స‌హ‌కారం ల‌భించ‌లేదు. ఇక బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ 3 వికెట్లు తీసి కోల్‌క‌తా ప‌త‌నాన్ని శాసించాడు. అలాగే చాహ‌ల్ 2 వికెట్లు తీయ‌గా, సైనీ, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన బెంగ‌ళూరు 13.3 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్ల న‌ష్టానికి 85 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో ప‌డిక్క‌ల్ 17 బంతుల్లో 3 ఫోర్ల‌తో 25 ప‌రుగులు చేయ‌గా, గుర్‌కీర‌త్ సింగ్ 26 బంతుల్లో 4 ఫోర్ల‌తో 21 ప‌రుగులు చేశాడు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో ఫెర్గుస‌న్‌కు ఒక వికెట్ ద‌క్కింది. మ‌రొక వికెట్ రనౌట్ రూపంలో ల‌భించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version