మహిళా ప్రపంచ కప్ లో భాగంగా నేడు భారత ఉమెన్స్ జట్టు. బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్టుతో తలపడనుంది. భారత ఉమెన్స్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే.. సెమీ ఫైనాల్స్ ఆశాలు ఉంటాయి. కాగ ఈ మ్యాచ్ లో భాగంగా.. భారత ఉమెన్స్ జట్టు టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మిథాలి సేన మొదట బ్యాటింగ్ చేయడానికి సిద్ధం అవుతుంది. కాగ మహిళా ప్రపంచ కప్ లో భారత్ కు ఇది ఆరోవ మ్యాచ్.
అలాగే బంగ్లాదేశ్ కు 5 వ మ్యాచ్. కాగ భారత ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడి కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచింది దీంతో పాయిట్ల పట్టికలో భారత ఉమెన్స్ జట్ట నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అలాగే బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ లలో కేవలం ఒకటి మాత్రమే విజయం సాధించింది. దీంతో బంగ్లాదేశ్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కాగ ఈ మ్యాచ్ కు ఇరు తుది జట్లు ఇలా ఉన్నాయి.
భారత ఉమెన్ తుది జట్టు :
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, మిథాలీ రాజ్( కెప్టెన్ ), హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్( వికెట్ కీపర్ ), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, రాజేశ్వరి గయాక్వాడ్, పూనమ్ యాదవ్
బంగ్లాదేశ్ ఉమెన్స్ తుది జట్టు :
షర్మిన్ అక్తర్, ముర్షిదా ఖాతున్, ఫర్గానా హోక్, నిగర్ సుల్తానా( కెప్టెన్ / వికెట్ కీపర్ ), రుమానా అహ్మద్, రీతు మోని, లతా మోండల్, సల్మా ఖాతున్, నహిదా అక్టర్, ఫాహిమా ఖాతున్, జహనారా ఆలం