తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఇవాళ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. నేడు ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది టీటీడీ పాలక మండలి.

కాగా, తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. అలాగే… నిన్న ఒక్క రోజునే 78892 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అటు 25930 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే హుండీ ఆదాయం 3.55 కోట్లుగా నమోదు అయింది.