తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం అనగానే జనాలకు ఒక ఆసక్తి ఉంటుంది. ఆయన మాట్లాడే మాటలను హింది వచ్చిన వాళ్ళు తెలుగు వచ్చిన వాళ్ళు అందరూ వింటూ ఉంటారు. ఆయన ఏ విధంగా మాట్లాడతారు అనే అందరూ పనులను మానుకుని టీవీ ముందు కూర్చుంటారు. కరోనా తర్వాత ఇది మరీ ఎక్కువగా కనపడుతుంది. ఆయన ప్రసంగాలకు ప్రాధాన్యత పెరిగింది.
ఆయన మాట్లాడే మాటలను కేంద్ర మంత్రులు కూడా వింటున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు అందరూ చాలా వరకు ఆసక్తిగా వింటున్నారు. కేసీఆర్ ప్రసంగం చూసి ఇప్పుడు కొంత మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఎన్ని కరోనా కేసులు ఉన్నాయి… ఏ దేశం ఏ చర్యలు తీసుకుంటుంది.. ఏ మందు వాడుతున్నారు, ఎవరికి నయం అయింది, ఎంత మంది చనిపోయారు. ఎంత మంది ఆరోగ్యం విషమంగా ఉంది,
ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంది… ఏ దేశం ఏ విధమైన చర్యలను తీసుకుంటుంది అనే విషయాలను ఆయన స్పష్టంగా వివరిస్తున్నారు. అలాగే బాధితుల సంఖ్యను లెక్కలతో సహా చెప్తున్నారు. ఇక తెలంగాణా లో తీసుకునే చర్యలను బాధితుల సంఖ్యను, క్వారంటైన్ లో ఎంత మంది ఉన్నారు… ఎంత మంది విదేశీయులు, ఎంత మందికి కరోనా సోకింది, ఎంత మంది మరణించారు, ఎవరు ఢిల్లీ వెళ్లి వచ్చారు…
దేశంలో బాధితులు ఎంత మంది… ఏయే రాష్ట్రాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిని ఆయన కేవలం నోటి మాటతో వివరిస్తున్నారు. ఆయన ప్రసంగంలో ఏదైనా అతి ముఖ్యం అయితే మినహా కేసీఆర్ పేపర్ చూడటం లేదు. దీన్ని చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా షాక్ అవుతున్నారు. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు కూడా ఆయన చాలా జాగ్రత్తగా చెప్తున్నారు. అసలు పేపర్ లేకుండా నోటి మాటతో కేసీఆర్ సమాధానం చెప్తున్నారు.