వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు శ్రీలంక మరియు ఆఫ్గనిస్తాన్ ల మధ్యన మ్యాచ్ జరగబోతోంది. పాయింట్ల పరంగా రెండు జట్లు కూడా నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ, రన్ రేట్ పరంగా చూస్తే శ్రీలంక ఆఫ్ఘన్ కన్నా మెరుగైన స్థితిలో ఉంది. కానీ ఇరు జట్లకు ఇంకా నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉండడంతో, అన్నీ గెలిచినా జట్టు ఏదైనా సెమీస్ రేస్ లో నిలబడే అవకాశం ఉంది. మొదట టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక జట్టు బ్యాటింగ్ చేస్తోంది. పుణేలో మ్యాచ్ జరుగుతుండడంతో బ్యాటింగ్ కు ఎక్కువగా అనుకూలిస్తుందని పిచ్ రిపోర్ట్ లో తెలిసింది. ఈ ప్రకారం చూస్తే ఈ మ్యాచ్ లో మొదటి ఇనింగ్స్ లో 300 కు పైగానే పరుగులు నమోదు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు సెమీస్ పై ఆశలు పెట్టుకోవచ్చు.. ఓడిపోయిన జట్టుకు ఇంటిదారే శరణ్యం.