WORLD CUP 2023: చేజింగ్ చేయనున్న ఇండియా… జట్టులో కీలక మార్పు !

-

వరల్డ్ కప్ లో ఈ రోజు ఇండియా మరియు ఆఫ్గనిస్తాన్ ల మధ్యన ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం లో మ్యాచ్ జరగనుంది. మొదట టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ అసమతుల్లా సాహిది బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆఫ్గనిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చాలా మంది షాక్ అయి ఉంటారు. ఎందుకంటే ఇండియా లాంటి టీం ను మొదట బ్యాటింగ్ కు ఆహ్వానించి తమ బౌలింగ్ తో ఆరంభంలో వికెట్లు పడగొట్టి ఒత్తిడిలోకి నెడితే ఏమైనా ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా ఇండియాకు ఛేజింగ్ ఇస్తే స్వల్ప స్కోర్ కె ప్రత్యర్థిని ఆల్ అవుట్ చేసి నిదానంగా చేధనను ఫినిష్ చేస్తారు. కానీ ఆఫ్ఘన్ మైండ్ లో ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా చూడాలి. కాగా ఈ రోజు మ్యాచ్ లో మొదటి మ్యాచ్ కంటే కేవలం ఒక్క చేంజ్ ను మాత్రమే చేసింది టీం ఇండియా. గత మ్యాచ్ లో ఆడిన స్పిన్నర్ అశ్విన్ కు బదులుగా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను తీసుకుంది.

వాస్తవంగా అశ్విన్ గత మ్యాచ్ లో వికెట్లు తీయలేకపోయినా బాగానే బౌలింగ్ చేసినట్లు అనిపించింది. మరి శార్దూల్ ను తీసుకోవడం వెనుక ఇంకేమైనా కారణంగా ఉందా ?

Read more RELATED
Recommended to you

Exit mobile version