ASIAN GAMES 2023: మెడల్స్ సాధించిన బాడ్మింటన్ ప్లేయర్స్ ను సన్మానించిన పుల్లెల గోపీచంద్ !

-

ఈ మధ్యనే చైనా వేదికగా ముగిసిన 19వ ఆసియన్ గేమ్స్ లో భాగంగా ఇండియా 107 పతకాలను సాధించి దేశ ప్రజలు అంతా తలెత్తుకునేలా చేశారు. ఇక బాడ్మింటన్ గేమ్ లో పురుషుల విభాగంలో సాత్విక్ మరియు ప్రణయ్ లను బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ హైద్రాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం లో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా గోపిచంద్ మాట్లాడుతూ ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ ను సాధించినందుకు చాలా గర్వంగా మరియు సంతోషంగా ఉందన్నారు. ఆసియన్ గేమ్స్ చరిత్రలో 41 ఏళ్ళ తర్వాత మేన్స్ టీం మెడల్ ను అందుకుని చరిత్ర సృష్టించిందని ప్రశంసించారు గోపీచంద్. గడిచిన పదేళ్ల కాలంలో ఇండియాలో గేమ్స్ కు చాలా ప్రాధాన్యత పెరిగినట్లు గోపిచంద్ చెప్పారు, ముఖ్యంగా మోదీ ప్రభుత్వం స్పోర్ట్స్ కు ఇస్తున్న ప్రాముఖ్యత మరియు సహాయాలు ఎన్నటికీ మరువలేనివి అంటూ పొగిడారు గోపిచంద్.

ఇక సింధు గురించి మాట్లాడుతూ మహిళల బ్యాడ్మింటన్ లో ఈమె ఇంకా ముందుకు వెళుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గోపీచంద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version