వరల్డ్ కప్ 2023 లో అనధికారికంగా పాకిస్తాన్ టీం సెమీస్ కు వెళ్లకుండానే నిష్క్రమించడానికి సిద్ధంగా ఉంది. పాకిస్తన ప్రస్తుతం ఆడిన ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే గెలిచి దాదాపుగా సెమీస్ అవకాశాలను దూరం చేసుకుంది. నిన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో గెలిచే అవకాశాన్ని వదులుకుని చేజేతులా వరల్డ్ కప్ నుండి నిష్క్రమించింది అని చెప్పాలి. ఈ ప్రభావం కెప్టెన్ బాబర్ ఆజామ్ మరియు కోచ్ లపై భారీగా పడే అవకాశం ఉంది. ఇక తాజాగా పాకిస్తాన్ క్రికెట్ సోర్స్ ప్రకారం వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా తో సిరీస్ కు టెస్ట్ మరియు వన్ డే లకు కెప్టెన్ గా సర్ఫరాజ్ మహ్మద్ ను మరియు టీ 20 లకు కెప్టెన్ షహీన్ అఫ్రిదీలను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కానీ ఇప్పటి వరకు అధికారికంగా సమాచారం ఇంకా రాలేదు. ఇలా జరిగితే బాబర్ అజాం కు చాల పెద్ద షాక్ అని చెప్పాలి. మరి ఏమి జరగనుందో తెలియాలంటే వరల్డ్ కప్ ముగిసే వరకు వేచి చూడాలి.