కరోనా వైరస్ అరికట్టే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలకు పలు సూచనలు ఇస్తూ అప్రమత్తం చేస్తుంది. మందులేని ఈ వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేదాకా నియంత్రణ ఒకటే మార్గమని దేశాలను ముందునుంచే హెచ్చరిస్తుంది. దీంతో WHO ఆదేశాల మేరకు లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా దేశాలు అమలు చేస్తున్నాయి.
అంతేకాకుండా మద్యం తాగితే రోగ నిరోధక శక్తి తగ్గుతుందని.. ఆ శక్తి తగ్గితే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వివరించింది. కుటుంబం కోసం మీ ఆరోగ్యం కోసం ప్రస్తుతం మద్యం మానేయండి అని డబ్ల్యూహెచ్ఓ కోరుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలకు కూడా సలహా ఇచ్చింది. ఈ సమయంలో ప్రజలకు మద్యం అందుబాటులో ఉండకుండా చేయాలని మద్యం నియంత్రించాలని సూచనలు చేసింది. దీనికి సంబంధించి ఓ నివేదిక కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసింది.