వరల్డ్ రికార్డ్; యష్ పుట్టిన రోజుకి 5 వేల కిలోల కేక్…!

-

కన్నడ స్టార్ హీరో యష్ తన 34 వ పుట్టినరోజును జనవరి 8 న ఘనంగా జరుపుకున్నారు. కేజీఎఫ్ సినిమా ద్వారా జాతీయ స్టార్ గా నిలిచిన యష్ పుట్టినరోజుకు 5000 కిలోల కేక్ ను తయారు చేయించారు అభిమానులు. అంతే కాకుండా 216 అడుగుల కటౌట్ ని ఏర్పాటు చేయించారు. అతను మర్చిపోలేని బహుమతి ఇచ్చారు అభిమానులు. కటౌట్‌లో కెజిఎఫ్ చిత్రంలో యష్ ‘రాకీ భాయ్’ అవతారంలో కనిపించాడు.

216 అడుగుల ఈ కటౌట్ ప్రపంచంలోని అతిపెద్ద కటౌట్లలో ఒకటిగా నిలిచింది. కేక్ తయారీకి భారీగా పదార్ధాలను వినియోగించారు. 5000 కిలోల కేకులోకి, 1800 కిలోల పిండి, 1150 కిలోల చక్కెర, 1750 కిలోల క్రీమ్, 22,500 గుడ్లు, 50 కిలోల పౌడర్, పండ్లు మరియు 50 కిలోల నెయ్యి వినియోగించారు. ఈ కేక్ 40 నుండి 70 అడుగుల ఉంది. బెంగళూరులోని నయందహళ్లిలోని నంది లింక్స్ గ్రౌండ్స్‌లో తయారు చేసి అక్కడే ఏర్పాటు చేశారు.

కేక్ తయారీ ప్రక్రియ యొక్క వీడియో ఒక అభిమాని పోస్ట్ చేసాడు. ఈ కేక్ ప్రపంచ రికార్డ్ ని సృష్టించి౦ది. మొత్తం 96 గంటల పాటు శ్రమించి 20 మంది ఈ కేక్ ని తయారు చేసారు. ఇక ఇదిలా ఉంటే అతని పుట్టిన రోజుని అభిమానులు భారీగా జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సేవా కార్యక్రమాలను నిర్వహించారు అభిమానులు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/kgfmovie/?utm_source=ig_embed

Read more RELATED
Recommended to you

Exit mobile version