అమ్మ ఒడి అందని వారికి సీఎం జ‌గ‌న్ మ‌రో డెడ్‌లైన్‌..

-

సంక్షేమ పథకాల అమలుతో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న అమ్మ ఒడి పథకం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా చిత్తూరులో ప్రారంభించారు. నాడు-నేడు పాఠశాలల్లో మౌలిక వసతులను పెంపొందించే కార్యక్రమంలో లో అమ్మ ఒడి లబ్ధిదారుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయడానికి వారికిచ్చే రూ.15 వేలలో ఒక రూ.1000 పాఠశాల అభివృద్ధికి కేటాయించమని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

అలాగే అమ్మ ఒడి అర్హత ఉండి దరఖాస్తు చేయని వారు ఫిబ్రవరి 9 లోగా దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా వర్తింప చేస్తామని తెలిపారు. కాగా, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నవరత్నాలు అమలులో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఒకటి నుంచి ఇంటర్‌ వరకు పిల్లలను చదివిస్తున్న పేదింటి తల్లుల ఖాతాలో నేరుగా రూ.15 వేలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టామన్నారు. 42,12,186 లక్షల మంది తల్లులకు, తద్వారా 81,72,224 మంది పిల్లలకు మేలు కలిగే విధంగా రూ.6318 కోట్లు ఇస్తున్నామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version