మాములుగా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. ఉల్లి అన్నీ సుగుణాలను కలిగి వుంటుంది కాబట్టి. ఇప్పుడున్న జనరేషన్ లో టెక్నాలజీ ఉపయోగించని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఇలా పిల్లలు, పెద్దలు రోజంతా మొబైల్ ఫోన్లని, టీవీ లని, లాప్టాపు అని చూస్తూ ఉండడం వల్ల కంటి నుండి నీరుకారడం, కళ్ళు కనిపించకుండా పోవడం వంటి సమస్యలే కాక ఎక్కువసేపు కూర్చునే ఉండడంవల్ల చాలా వ్యాధులు శరీరాన్ని అవహిస్తున్నాయి. వీటన్నింటికి తెల్లఉల్లితో చెక్ పెట్టొచ్చు. తెల్లఉల్లిలో వుండే పోషకాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లి మాములుగా మూడు రంగుల్లో దొరుకుతుంది. అవి లైట్ పింక్, వైట్, ఎల్లో రంగుల్లో వుంటాయి. అన్నింటి కన్నా తెల్ల ఉల్లిలో ఎక్కువ ఆరోగ్యకర సుగుణాలు వుంటాయి.తెల్లఉల్లిలో విటమిన్ సి, ఫ్లేవనోయిడ్స్ న్యూట్రియంట్స్, సల్పర్, మెగ్నీషియం మొదలుగునవి ఎక్కువగా వుంటాయి. ఇందులో వున్న ఫ్లేవనోయిడ్స్ వల్ల పార్కిన్సన్ వ్యాధులు రాకుండా చేస్తుంది.దీనిలో వుండే సల్పర్ మరియు క్రోమియం బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది.తెల్ల ఉల్లిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడంవల్ల మధుమేహ రోగులకు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది.కంటిచూపును మెరుగుపరుస్తాయి.
క్యాన్సర్ నివారణ..ఇందులో వుండే సల్పర్ మరియు ఫ్లేవనోయిడ్స్ కాన్సర్ రాకుండా చేస్తాయి. క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడే యాంటీ ఏజెంట్స్ ని ఉత్పత్తి చేస్తాయి.క్యాన్సర్ కణతులు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. ఇందులో వుండే ప్రీ బయాటిక్స్ మరియు పైబర్ జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వల్ల అనవసర కొవ్వులను కరిగించి గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మరియు వృద్దులకు బోన్ డేన్సిటీ పెరిగి చక్కగా నడవగల్గుతారు.
తెల్లఉల్లిలో యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలవల్ల రక్తంను పల్చగా చేసి రక్తనాలాళ్లలో గడ్డ కట్టకుండా చేస్తుంది. మరియు ఇందులో ఉండే సెలీనియం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీనిని రోజూ తీసుకోవడవల్ల నిద్రలేమితో బాధపడేవారికి ఇందులో వుండే అమైనో ఆసిడ్స్ బాగా నిద్రపట్టడానికి ఉపయోగపడతాయి. వత్తిడిని కూడా తగ్గించి కంటిచూపును మెరుగుపరుస్తుంది. తెల్లవుల్లి నుంచి రసం తీసి జుట్టు కుదుళ్లకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య తగ్గి, జుట్టు నిగనిగాలాడుతుంది.