వామ్మో.. ప్రభాస్ సినిమాల బడ్జెట్ విలువ అన్ని రూ.వేల కోట్లా..?

-

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి.. ఆయన స్టార్డం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈయన అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నాడు. ఇకపోతే దాదాపు 17 సంవత్సరాల క్రితం ఛత్రపతి సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.అంతేకాదు అప్పట్లో.. ఆడి బాడీ బాక్సాఫీస్ అంటూ ప్రభాస్ గురించి ఓ డైలాగ్ రాయించారు రాజమౌళి. ఇప్పుడు దానిని నిజం చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఈయన మీద రెండున్నర వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమాలోనే మోస్ట్ బిజియస్ట్ హీరోగా మారిపోయాడు.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. ఇదే నిజం.. ఎందుకంటే ప్రభాస్ చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి. పైగా అందులో చర్చల దశలో ఉన్నవి కాదు.. కన్ఫర్మేషన్ వచ్చినవి .. నిర్మాతలే ఈ అన్ని సినిమాలను కూడా ఖరారు చేశారు. అందులో ఏది ఎప్పుడు వస్తుందో కూడా ప్రభాస్ కి కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతం సలార్ , ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు ఈయన. వీటి షూటింగ్ సైమంటేనియస్ గా చేస్తున్నారు. ఒక వారం ప్రశాంత్ నీల్ సినిమాకు డేట్స్ ఇస్తూనే.. మరొక వారం సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. రెండు సినిమాలతో పాటు మారుతి ప్రాజెక్టు కూడా పట్టా లెక్కించారు. ఈ మూడు సినిమాల బడ్జెట్ విలువ అక్షరాల రూ.800 కోట్ల పైమాటే.

మరోవైపు ఆది పురుష్ షూటింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది. దీనికోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కూడా రూ.300 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతోంది. మరొకవైపు దిల్ రాజు కూడా ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్లో రావణం అనే సినిమా ఖరారు చేశారు. దీని విలువ రూ.600 కోట్లకు పైగానే.. వీటన్నింటి సినిమాల బడ్జెట్ లెక్క కలిపి చూస్తే రూ. 2,500 కోట్లకు పైగానే ఉంది అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version