రైటర్ పద్మభూషణ్ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

-

మొదట కమెడియన్గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుహాస్.. హీరోగా నటించిన చిత్రం కలర్ ఫోటో ఈ సినిమా ఓటీటి లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో విలన్ గా కమెడియన్ గా కూడా నటించారు.

తాజాగా హీరో గా రైటర్ పద్మభూషణ్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సుహాస్ హీరోగా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ గత నెల రిలీజ్ అయి మంచి టాక్ సంపాదించుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు సిద్ధపడుతోంది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 17న జీ5 లో రిలీజ్ కానుంది. ఉగాది కానుకగా ఈ సినిమాను ఓటిటిలోకి తెస్తున్నట్లు జీ5 పేర్కొంది. శేఖర్ చంద్ర, కళ్యాణ్ లు సంగీతం అందించిన ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, రోహిణి తదితరులు నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version