నిన్నటి నుండి ప్రారంభం అయిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇండియా మరియు ఆస్ట్రేలియా ల మధ్య హోరాహోరీగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా రెండవ రోజు ఆటను కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు ఇండియా బౌలర్లు కళ్లెం వేయలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. క్రీజులో స్టీవెన్ స్మిత్ మరియు క్యారీ లు ఉన్నారు. ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ కు సిరాజ్ తెరదించాడు. హెడ్ 163 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత గ్రీన్ ను షమీ అవుట్ చేయడంతో కొంత ఉపశమనం ఇండియాకు దక్కింది.
WTC ఫైనల్ 2023 :భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా… !
-