వివేకా హత్య కేసులో కీలక మలుపు.. 8వ నిందితుడిగా అవినాష్ రెడ్డి

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై శుక్రవారం సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దని ఈనెల 5వ తేదీన కౌంటర్ దాఖలు చేసింది సిబిఐ. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. వైఎస్ అవినాష్ రెడ్డి ని ఈ కేసులో సిబిఐ ఎనిమిదవ నిందితుడిగా చేర్చింది.

గతంలో దాఖలు చేసిన కౌంటర్ లో అవినాష్ రెడ్డిని సహనిందితుడిగా పేర్కొన్నారు. కానీ ఎక్కడ నిందితుడిగా చెప్పలేదు. అయితే తాజాగా ఈనెల 5వ తేదీన దాఖలు చేసిన కౌంటర్ లో మాత్రం అవినాష్ రెడ్డిని ఏ 8 గా సిబిఐ ప్రస్తావించింది. కుట్ర, సాక్షాల చెరిపివేతలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల ప్రమేయం ఉందని వెల్లడించింది. తండ్రి కుమారులు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నించారని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version