వాయువ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫానుగా యాష్ కొనసాగుతుంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు మధ్యాహ్నం, ఉత్తర ఒరిస్సాలోని, పారాదీప్ బాల సూర్ మధ్య ధర్మ పోర్టు సమీపంలోని దిగా ప్రాంతంలోతీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది అని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో బెంగాల్ లో భారీ వర్షాలు పడుతున్నాయి.
పారాదీప్ కు తూర్పు దిశగా 80 కిలోమీటర్ల కి అలాగే బాలాసోర్ కి దక్షిణ ఆగ్నేయంగా 90, కిలోమీటర్లు, ధర్మా పోర్టు తూర్పుదిశగా 40 కిలోమీటర్లు, దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 130 నుంచి 140 కొన్నిసార్లు 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయఐ హెచ్చరించారు. ఉత్తర ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.