భారత్‌లో కియా పేరు మార్పు.. కారణం?

-

భారత్‌లో కియా మోటర్స్‌ పేరు మార్పు జరిగింది. నేటి నుంచి భారత వ్యాప్తంగా పేరు.. లోగో మారుస్తున్నట్టు ఆ సంస్థే అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ పేరు మార్పుకు కారణం ఏంటో తెలుసుకుందాం.
2019లో భారత్‌ లో కియా అడుగుపెట్టింది. భారత్‌ లో తొలిసారిగా సెల్టోస్‌ పేరుతో కార్ల ను తయారు చేసింది.
కియా కార్లు మంచి పేరు పొందినవి. ఈ కియా కార్లకు భారత్‌ లో డిమాండ్‌ పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో కియా కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతారు. దక్షిణ కొరియాకు చెందిన కార్ల కంపెనీ కియా భారత్‌ లోనే అడుగు పెట్టినా.. కేవలం రెండేళ్ల లోపే అగ్రగామి కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

తాజాగా కియా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్‌ లో తన పేరు మార్చుకుంటున్నట్టు ప్రకటించింది. కియా మోటార్స్‌ను ఇకపై ‘కియా ఇండియా’గా మారుస్తున్నట్లు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అనంతపురం ప్లాంట్‌ కేంద్రంగా పనిచేస్తున్న కొరియన్‌ కార్‌ బ్రాండ్‌ కియా మోటార్స్‌ ఇండియా ఇకపై తమ సంస్థ పేరును కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఐపీఎల్‌)గా మార్చుకుంటున్నట్లు ప్రకటించింది. కొంత కాలం నుంచి కియా ప్రపంచ వ్యాప్తంగా తమ కార్ల కోసం కొత్త లోగోను ఆవిష్కరిస్తోంది. డీలర్‌షిప్‌ కేంద్రాల దగ్గర కూడా దశలవారీగా ఆ మేరకు మార్పులు చేయనున్నట్లు కియా తెలిపింది.
భారత్‌ వ్యాప్తంగా రెండున్నర లక్షలపైగా కార్లను విక్రయించింది ఆ సంస్థ.. అయితే తమ సక్సెస్కు చిహ్నంగా తమ పేరును మార్చాలి అని యాజమాన్యం భావించింది. కొత్త పేరు కంపెనీ బ్రాండ్‌ కు మరింత గుర్తింపు తెచ్చి పెడుతుందని భావించే పేరు మారుస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version