ఎన్నికల వ్యూహానికి పదును పెట్టిన వైసీపీ.. డైలమాలో టీడీపీ. జనసేన..

-

సీఎం జగన్ ఎన్నికల సంగ్రామంలోకి దిగేశారు.. ప్రత్యర్దులను చిత్తు చేసేలా తన వ్యూహాలకు పదును పెట్టారు.. గత ఎన్నికల్లో మాదిరిగానే కాపు ఓట్లను తన వైపుకు తిప్పుకునేలా అడుగులు వేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ కు చెక్ పెడుతూ కొన్ని సంచలన నిర్ణయాలను సీఎం జగన్ తీసుకుంటున్నారు.. టీడీపీ మీద విసిగిపోయిన కాపులు గత ఎన్నికల్లో జగన్ వైపు నిలబడ్డారు..దీంతో వైసీపీ కొన్ని జిల్లాల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది.. కాపు ఓట్లపై ఆశలు పెట్టుకుని పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌ సైతం జగన్ వ్యూహాలకు చిత్తు చిత్తుగా ఓడిపోయారు..

గత ఎన్నికల్లోని పలితాలను పునరావృతం చేసేందుకు సీఎం జగన్ పక్కా ప్లాన్ తో రాజకీయం మొదలు పెట్టారు.. ఈసారి ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. ఉత్తరాంద్రలో అత్యధిక జనాభా కల్గిన కాపు ఓటర్ల మీదే ఈ రెండు పార్టీలు దృష్టి పెట్టాయి.. గంపెడు ఆశలతోనూ ఉన్నాయి.. ఈ క్రమంలోనే రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని కలిసి ఎన్నికలను వెళ్లాలని నిర్ణయించుకున్నాయి.. ఈ క్రమంలోనే వైసీపీ మరో కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చింది.. తెలంగాణలో బిజేపీతో కలిసి పోటీ చేసిన జనసేనకు టీడీపీ ఎందుకు మద్దతు ఇవ్వలేదని వైసీపీ ప్రశ్నిస్తోంది.. ఏపీలో ఉన్న కాపు నేతలు టీడీపీకి ఎందుకు మద్దతివ్వాలో జనసేన నేతలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.. టీడీపీ అవకాశ వాద రాజకీయాలు చేస్తోందని వైసీపీ మండిపడుతోంది.. జనసేన నేతలు టీడీపీ చేతిలో పావులుగా మారుతున్నారని వైసీపీ చెబుతోంది..

టీడీపీతో పొత్తుపై జనసేనలోని కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నా.. పవన్ మాత్రం మొండిగానే వ్యవహరిస్తున్నారు.. దీంతో కొందరు జనసేన నేతలు గుర్రుగా ఉన్నారు.. పార్టీలో తమ మాటకు పవన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. టీడీపీ ట్రాన్స్ లో పడిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ అనాలోచిత నిర్ణయాలతో టీడీపీ, జనసేన రెండూ బొక్కబోర్లా పడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version