టీడీపీలో డబ్బున్నోళ్లకే టిక్కెట్లు.. నమ్మిన వారికి చంద్రబాబు హ్యాండ్..

-

వచ్చే ఎన్నికల్లో ప్రజాబలం కల్గిన వైసీపీ అభ్యర్దులను ఓడించేందుకు చంద్రబాబు మాష్టర్ ప్లాన్ వేశారు.. బాగా డబ్బున్నోళ్లను రంగంలోకి దింపాలని భావిస్తున్నారట.. అందులో భాగంగా ఇప్పటికే కొందరు ఎన్నారైలకు చంద్రబాబు సీటు ఆఫర్ చేస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారిని కాదని చంద్రబాబు ఎన్నారైలకు టిక్కెట్లు ఇవ్వడంపై స్వంత పార్టీ నేతలే రగిలిపోతున్నారట..

వైసీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానిపై ఎన్నారైను దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట.. అందులో భాగంగా ఆర్దికంగా స్థితిమంతుడుగా ఉన్నవెనిగళ్ల రామును నియోజకవర్గంలో తిప్పుతున్నారట.. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న రావి వెంకటేశ్వర్ రావుకు చంద్రబాబు మొండి చెయ్యి చూపడంతో ఆయన అనుచరులు గుర్రుగా ఉన్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. గుంటూరు పశ్చిమ,విజయనగరం జిల్లా శృంగవరపుకోట ,నెల్లిమెర్ల నియోజకవర్గం, పార్వతీపురం నియోజకవర్గాల్లో కూడా ఎన్నారైలకు చంద్రబాబు అవకాశం ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

రానున్న ఎన్నికల్లో 8-10 నియోజకవర్గాల్లో ఎన్నారైలు పోటీ చేస్తారని చెబుతున్నారు.పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నేతలను కాదని చంద్రబాబు నాయుడు ఎన్నారైలకు అవకాశం ఇస్తూ ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో నేతల మద్య కోల్డ్ వార్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది.. చంద్రబాబుకు డబ్బు పిచ్చి పట్టుకుందని, అందుకే పార్టీకి పండ్ ఇచ్చి.. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టేవారికే టిక్కెట్లు అమ్ముకుంటున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తమను కాదని.. అభ్యర్దులు ఎలా గెలుస్తారో చూస్తామని నేతలు సవాళ్లు విసురుతున్నారట..

Read more RELATED
Recommended to you

Exit mobile version