రాజ‌కీయాల‌కు కీల‌క నేత గుడ్ బై… వైసీపీలో క‌ల‌క‌లం…!

-

తెలుగు రాజకీయాల్లో పాపులర్ సీనియర్ నేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని సదరు సీనియర్ నేత తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఎందరో రాజకీయ నాయకులకు ఒక దారి చూపించిన ఆ నేత ఇప్పుడు రాజకీయ చదరంగంలో సొంత పార్టీ నేతల ఎత్తులకు చిత్తయ్యి తనకుతానుగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇంతకు ఆ నేత ఎవరో కాదు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.

ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన ఈరోజు పర్చూరు నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన తనంతట తానుగా రాజకీయాలకు దూరంగా ఉండటమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు దగ్గుబాటి భార్య పురందేశ్వరి బీజేపీ నుంచి పోటీ చేస్తే దగ్గుబాటి అనూహ్య పరిణామాల నేపథ్యంలో ప‌ర్చూరులో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇక సీఎం జగన్ భార్య భర్తలు ఇద్దరు ఏదో ఒక పార్టీ లోనే ఉండాలి అని తేల్చి చెప్పడంతో… తన కుటుంబ సభ్యులతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇక ఇప్పటి వరకు కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసమే తన ఆలోచనని… అయితే ఇప్పుడు ఆ కుమారుడే తన కోసం మీ ఆత్మాభిమానం చంపుకోవద్దని చెప్పడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని దగ్గుబాటి తన ముఖ్య అనుచరులతో చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలో సైతం దగ్గుబాటికి పొమ్మనకుండా పొగ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో, ఇమడలేక ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగలేక తాను రాజకీయాలకు దూరంగా ఉండటమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టు కూడా తన సన్నిహితులకు ఆయన చెప్పారట.

ఇక ఈ పరిణామాలన్నింటినీ వివరిస్తూ ఆయన తన అభిమానులకు నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాయాలని భావిస్తున్నట్టు సమాచారం. తెలుగు రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్న ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో ఇమడలేక టోటల్ రాజకీయాలకు గుడ్బై చెప్పాలని నిర్ణయం తీసుకోవటం చాలామందికి షాకింగ్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version