మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటిపై కేసుకు సంబంధించి ఏపీ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. అలాంటి అవినీతిని విచారణ చేయాలని చెప్పాల్సింది పోయి ఆపేశారని ఆయన అసహనం వ్యక్తం చేసారు. మీడియాలో రాకూడదు అంటూ రాత్రికి రాత్రి ఆదేశాలు రావడం భంగం కలిగినట్లు భావిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
పెద్దలకు ఒక తీర్పు…సామాన్యులకు ఒక తీర్పు అనేలా పరిస్థితి ఉందని మండిపడ్డారు. దీని వల్ల న్యాయ వ్యవస్థ నిష్పక్షికత ప్రశ్నర్ధకం అవుతోందని, దమ్మాలపాటి శ్రీనివాస్ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ అన్నారు. ఇది ఆషామాషాగా చేసింది కాదని.. దీనికి ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తప్పు జరిగిందా లేదా అనే అంశాన్ని కక్ష సాధింపుగా మార్చడం దొంగలకు అవకాశం ఇచినట్లే అవుతుందన్నారు.