ప్రభుత్వ భూములు ఆక్రమించిన ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదు !

-

దేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో ఒకటయిన గీతం యూనివర్సిటీ భవనాలను ఏపీ సర్కార్ ఈరోజు కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది ప్రభుత్వం. ఈ గీతం యూనివర్సిటీ నిర్వాహకులు ప్రస్తుతం టీడీపీలో ఉన్నందునే ఈ కక్ష సాదింపు ధోరణిలో పాల్పడుతుందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ విషయం మీద అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ క్లారిటీ ఇచ్చారు. విశాఖలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని ప్రభుత్వ స్వాదీనం చేసుకుంటే కొంతమంది రాజకీయం చేస్తున్నారని అన్నారు. నారా లోకేష్ తోడొల్లుడు భరత్ దాదాపు 40 ఎకరాల భూమిని తన ఆక్రమణలో పెట్టుకున్నారని, దాదాపు ఎనిమిది వందల కోట్లు విలువ గల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారని అమర్నాథ్ అన్నారు.

ఆ విశ్వవిద్యాలయానికి గాంధీ పేరుపెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఐదు నెలల క్రితం గీతం యాజమాన్యానికి అధికారులు తెలియజేశారని అన్నారు. ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలో ఉంటే ప్రభుత్వం స్వాదీనం చేసుకోవడానికి ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన ఎవ్వరిని విడిచిపెట్టేది లేదని ఆయన అన్నారు. ఇటువంటి విశ్వవిద్యాలయం లో విద్యను అభ్యసిస్తే సమాజానికి ముప్పు తప్పదని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు అన్నారు. టీడీపీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారన్న అదీప్ భూ ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version