ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నేతల విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు పార్టీ వ్యవహారాల్లో తలదూర్చి పని చేసే ప్రయత్నం చేయడం లేదు. నెల్లూరు జిల్లాలో ఆనం రామ్ నారాయణ రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి జగన్ కాస్త ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్నారు ఆయన.
ఇక ఆయనకు అధికారులు కూడా పూర్తిగా సహకరించడం లేదు. ఇక జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఆయనకు సహకరించే ప్రయత్నం చేయటంలేదు. వాస్తవానికి ఆర్థిక శాఖ విషయంలో ఆయనకు చాలా అనుభవం ఉంది. అయినా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి ఆయన కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి జగన్ కు సూచనలు కూడా చేసే ప్రయత్నం చేయకపోవటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవాలి.
రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా అనుభవం ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయి పలు సూచనలు సలహాలు ఇవ్వాలని కొంత మంది కోరుతున్నారు. అయినా సరే పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కూడా ఆయన కలవడానికి ఆసక్తి చూపించడం లేదని సమాచారం. చాలా మంది ఎమ్మెల్యేలు జగన్ ని కలవడానికి ఆసక్తి చూపిస్తున్న సరే ఆనం రామనారాయణరెడ్డి మాత్రం కనీసం జగన్ వద్దకు వెళ్లడం లేదని అంటున్నారు.