పల్నాడు వైసీపీలో ముసలం – ఎంపీ vs ఎమ్మెల్యే !

-

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో సూపర్ మెజారిటీతో గద్దెనెక్కిన జగన్ చెంతకు ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా నెమ్మదిగా చేరుతున్నారు. అభివృద్ధి పేరు చెప్పి వెళుతోన్నా అధికార పార్టీ వేధింపులు తట్టుకోలేకే వెలుతున్నారని ప్రతిపక్ష పార్టీ కూడా అంతర్గతంగా సైలంట్ గా ఉండమని చెబుతోంది. అయితే అలా రాష్ట్రంలో హవా చూపిస్తోన్న జగన్ కి సొంత పార్టీ నేతల మధ్యనే ముసలం పుట్టడం టెన్షన్ గా మారింది.

పల్నాడులోని అధికార పార్టీ నేతల మద్య కోల్డ్ వార్ మొదలయిందని తాజాగా తేలింది. పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక ఎంపీ – ఎమ్మెల్యే మద్య ఆదిపత్యపోరు నెలకొందని తెలుస్తోంది. తన పదవిని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే పై ఎంపీ నిఘా పెట్టించాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు ఎమ్మెల్యే ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళాడు. అయితే ఎంపీ కూడా అధికార పార్టీ వాడే కావడంతో ప్రస్తుతానికి ఆయన్ని ఏమీ చేయని ప్రభుత్వం ఆయన ఆదేశాల మీరకు నిఘాకు పాల్పడిన ఓ డిఎస్పీ, సిఐ పై వేటు వేసింది. ఈ వ్యవహరం మాత్రం జిల్లాలో తీవ్ర చర్చంశనీయంగా మారిందని చెప్పచ్చు. మరి ఎంపీ మీద ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version