బ్రేకింగ్ : 8 మున్సిపాలిటీల్లో వైసిపి పార్టీ గ్రాండ్ విక్టరీ

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఉదయం నుంచి మున్సిపల్ ఎన్నికల ఫలితాల హడావుడి ఉన్న సంగతి తెలిసిందే. ఉదయం ఎనిమిది గంటలకు ఈ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం వరకు పూర్తికానుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ ప్రకారం అధికార వైసిపి పార్టీ ఏకంగా ఎనిమిది మున్సిపాలిటీలను గెలుచుకుంది.

మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా అందులో 8 మునిసిపాలిటీల పై జెండా ఎగురవేసింది వైసిపి. ఇక ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీలో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచింది. మరో మూడు మున్సిపాలిటీల కౌంటింగ్ జరుగుతోంది.

పెనుగొండ, కమలాపురం, దాచేపల్లి, బేతంచర్ల, ఆకివీడు, రాజంపేట, గురజాలలో వైసీపీ పార్టీ విజయ ఢంకా మోగించగా, దర్శి లో మాత్రం టీడీపీ పార్టీ విజయం సాధించింది. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటి లోనూ టిడిపి పార్టీ దూసుకుపోతుంది. 1,3,4,6,12,13,15,16 మొత్తం ఎనిమిది వార్డులు ఇప్పటికీ కైవసం చేసుకుంది టిడిపి పార్టీ. కేవలం 5 7,8,9,14 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. మరో 5 వార్డుల కౌంటింగ్ కొనసాగుతుండగా , ఇంకా 13 వార్డులు లెక్కించాల్సి ఉంది…

Read more RELATED
Recommended to you

Exit mobile version