గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వర్షంలో వసూ మీరు మారి పోయారు సార్ అని అరిస్తే..రిషీ నేను మారలేదు కోపంగా అంటాడు..మనసులో ఏది ఉంటే అది చెప్పే రిషీ సార్ కాదు మీరు, మీరు మారిపోయారు, నాకు జ్వరం వస్తే ఇంటికి వచ్చి మెడమ్ మీద అరిచారంట, హాస్పటల్ కి తీసుకెళ్దామన్నారంట ఆ రిషీ సార్ కాదు మీరు. రిషీ ఆహా బాగా మాట్లాడుతున్నావ్..నువ్వు మారలేదా, కాలేజ్ లోకి వచ్చినప్పుడు ఉన్న వసుధారవి కాదు నువ్వు, చదువే లోకం అనుకునే బతికే వసుధారవి కాదు, నీ థ్యాంక్స్ రిసీవ్ తీసుకేలదని కాలేజ్ టెర్రస్ పైకి ఎక్కి అల్లరి చేసిన వసుధారవి కాదు, మీరు జెంటిల్ మెన్, ప్రిన్స్ వి అని తెగ పొగిడేదానివికాదు, మనసులో ఉన్నవి అన్నే చెప్పే వసుధారవి కాదు, మారింది నువ్వు వసుధార..నేను కాదు అంటాడు.
ఇలా ఇద్దరు పోటాపోటీగా నువ్వు మారావ్ అంటే నువ్వు మారావ్ అని వాదించుకుంటారు..రిషీ నువ్వు మారకపోతే..శిరీష్ తో నీ పెళ్లిని అని నాకు ఎందుకు చెప్పలేదు అంటాడు. వసూ షాక్ అవుతుంది..శిరీష్ తో నాకు పెళ్లి ఏంటి సార్ అంటే..శిరీష్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నావ్, రింగ్ పెట్టుకున్నావ్, పెళ్లికి లీవ్ అడిగివ్..ఒక్కమాటైనా చెప్పావా లేదుకదా అందుకే నీ మీద నాకు కోపం అంటాడు రిషీ. వసూ నేను శిరీష్ పెళ్లిచేసుకుంటున్నామని మీకు ఎవరు చెప్పారు సార్, శిరీష్ వేరే అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లిచేసుకోవాలనుకున్నాడు, మహేంద్ర సార్ హెల్ప్ తీసుకున్నాడు అని మాట్లాడుతూనే స్పృహ కోల్పోతుంది. రిషీ ఎత్తుకుని కారులో కుర్చోపెట్టుకుని వెళ్తాడు.
ఇక్కడ మహేంద్ర, జగతీలు టెన్షన్ పడుతూ ఉంటారు. జగతి మనం ఇంట్లో తిరిగుతూ ఆలోచించటం కరెక్టుకాదు అని జగతి అంటే.. వాళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే..రిషీ వసూని ఎత్తుకుని తీసుకొస్తాడు. వాళ్లు ఇద్దరూ కంగారుపడతారు. రిషీ వసూని బెడ్ మీద పడుకోబెట్టి..తనను చూసుకోండి మేడమ్ అని బయటకు వస్తాడు. బయట హాల్ లో రిషీ ఉంటాడు. జగతి రిషీకి టవల్ ఇవ్వబోతే..వసుధారకు ఎలా ఉంది అని అడిగితే..జగతి తనకు ఏమైంది సార్ అంటుంది. వర్షంలో తడిచింది, డ్రస్ ఛేంజ్ చేసి, వేడివేడి కాఫీకానీ, పాలు కాని ఇవ్వండి అంటాడు. మహేంద్ర అడిగితే..మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి వెళ్లిపోతాడు. మహేంద్ర పని అయిపోయిందిలే..
మరోపక్క దేవయాని రిషీ ఉన్నపలాన వెళ్లిపోయాడు అని ఓ తెగ హైరానాపడుతూ ఉంటుంది. ధరణీమీద తన కోపం అంతా చూపిస్తుంది. ఇలా ఉండగానే రిషీ వస్తాడు. రిషీ తడిచి రావటంతో..దేవయాని అయ్యయ్యో ఏమైంది నానా ఏంటి ఇలా తడిచిపోయావ్ అంటే..ధరణిని టవల్ తీసుకురమ్మని పంపిస్తుంది..రిషీ నా గదిలోకి వెళ్లి ఫ్రష్ అప్ అయి వస్తాను అని వెళ్లిపోతాడు. దేవయాని ఏంటో రిషీ ఈ మధ్య మారిపోతున్నాడు, నాకు ఏం చెప్పటంలేదు, జారిపోతున్నాడా అనుకుంటుంది.
రిషీ గదిలోకి వచ్చి వసుధార అన్న మాటలను తలుచుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అద్దంలో వసుధార వచ్చి మాట్లాడుతున్నట్లు రిషీకి అనిపిస్తుంది. ఎదుటివారు ఎలా ఉండాలో కూడా మీరే నిర్ణయించుకుంటారు అదే మీ ప్రాబ్లమ్, వాళ్లు మీరు అనుకున్నట్లు లేకపోతే ఫీల్ అవుతారు, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాగే ప్రవర్తించాలి అనుకుంటే..ఆ అంచనాలు తప్పినప్పుడు ఇలాగే ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ఒక్కమాట నన్ను అడిగితే నేను చెప్పేదాన్ని కదా, మనసులో దాచుకుని మీకు మీరే కుమిలిపోయారు అని వసూ అన్నట్లు అనిపిస్తుంది. ఇంతలో దేవయాని, ధరణి వస్తారు. దేవయానికి ప్రశ్నలమీద ప్రశ్నలు అడుగుతుంటే..పెద్దమ్మా ప్లీజ్ మీరు వెళ్లండి అంటాడు. ఇద్దరూ వెళ్లిపోతారు.
ఇటుపక్క జగతి వసుధార పక్కన కుర్చోని..వసుధార ఏమైంది నీకు, ఎక్కడ మొదలపెట్టిన నువ్వు ఎక్కడివరకూ వెళ్లావ్, వర్షంలో ఎందుకు తడిచావ్ అని అనుకుంటూ ఉంటుంది. హాల్ లో మహేంద్ర ఉంటాడు..ధరణి కాల్ చేసి రిషీ ఇంటికి వచ్చినట్లు చెప్తుంది. మహేంద్ర వీళ్లు ఎక్కడు కలిశారు, నాకెందుకు చెప్పలేదు అనుకుంటూ ఉంటాడు. వసూకి రిషీ అన్నమాటలు గుర్తుకొచ్చి సడన్ గా లేస్తుంది. నేను ఎక్కడున్నాను మేడమ్ అంటే..మన ఇంట్లో ఉన్నావ్ అంటుంది జగతి. నేను ఎలా వచ్చాను మేడమ్ అంటుంది, రిషీ తీసుకొచ్చాడు అని ఏమైంది అని అడుగుతుంది. వసుధార నేను రిషీ సార్ కలవాలి అని వెళ్తా వెళ్తా అంటుంది..జగతి కోప్పడి..మీతో మాకు పెద్ద తలనొప్పి అయిపోయింది, ఏమైందో ఇద్దరూ చెప్పరూ..బుద్దిగా పడుకో.. రేపు మాట్లాడుకోవచ్చు, మనసును ప్రశాంతగా ఉంచుకో అని వసూని పడుకోబెడుతుంది. వసూకి మాత్రం ఉన్నపళంగా రిషీ సార్ ని కలవాలనే ఉంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
– Triveni Buskarowthu