మధ్యంతర బెయిల్‌పై విడుదలైయ్యారు వైసీపీ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఇక మిథున్‌రెడ్డి విడుదల కావడంతో… ఆయనకు జైలు వద్ద ఘన స్వాగతం పలికారు వైసీపీ శ్రేణులు. రాజమండ్రి నుంచి బయల్దేరిన వైసీపీ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి… పుంగనూరు వెళ్లినట్లు చెబుతున్నారు.

మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు… విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో కాసేపటి క్రితమే… మధ్యంతర బెయిల్‌పై విడుదలైయ్యారు వైసీపీ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.
ఈ కేసులో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు అయింది. ముగ్గురికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు….విడుదల చేయాలని పేర్కొంది. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది ఏ పీ ఏ సీ పీ కోర్టు. ముగ్గురి పాస్ పోర్ట్‌లను కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.