వైసిపి ఓ ట్రేడింగ్ కంపెనీలా మారిపోయిందని మండిపడ్డారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఎస్సీలను రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకుల చూస్తోందని విమర్శించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎస్సీ మోర్చా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి పాలనలో 4 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని ఆరోపించారు.
రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ మాఫియా నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ నిధుల కోసం బిజెపి ఎస్సీ మోర్చా 48 గంటలు దీక్ష చేపట్టిందని.. మిగిలిన పార్టీలు మీటింగులు పెట్టి వెళ్లిపోవడమే కానీ బిజెపి మాత్రమే వారి సమస్యలపై పోరాడుతుందని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనని అన్నారు. ఏప్రిల్ లో ఎస్సీల బహిరంగ సభ విజయవాడలో నిర్వహించబోతున్నామని తెలిపారు.