నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరో ముడు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నట్లు వివరించింది. ఇక రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లో వర్షాపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఎల్లో అలెర్ట్ ని విడుదల చేసింది.
ఈ మేరకు పట్టణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. అందువల్ల రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. లోతట్టు ప్రాంతాల వారు ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించాలని, వాగులు వంకలు, నదులు ఉన్న ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచింది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఆకాశం మేఘావృతమై ఉంది.