తెల్ల బట్టల మీద అప్పుడప్పుడు మరకలు పడుతూ ఉంటాయి. మంచి తెల్ల బట్టల మీద మరకలు పడితే మనకి చాలా బాధగా ఉంటుంది. మరక పోవాలని మనం చూస్తూ ఉంటాము తెల్ల బట్టల మీద కనుక పసుపు రంగులో మరకలు పడినట్లు అయితే ఇలా చేయండి. ఈజీగా మరకని వదిలించుకోవచ్చు. మరక ని తొలగించడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. సింపుల్ చిట్కా ని పాటిస్తే సరిపోతుంది బట్టల మీద మరకపోయి మళ్లీ మెరుపు రావాలంటే ఇలా చేయండి.
కాస్టిక్ సోడా చాలా చవక గానే మనకి దొరుకుతుంది. తెల్లని దుస్తులని నిమిషంలో మెరిసేటట్టు ఈ సోడా చూస్తుంది. కాస్టిక్ సోడా ని మనం ఉపయోగించినట్లయితే తెల్లగా వచ్చేస్తాయి బట్టలు. పైగా దీని వలన పసుపు రంగు మరకలు అన్నీ కూడా పోతాయి. చక్కగా దుస్తులు వచ్చేస్తాయి. ఇక దీని కోసం ముందు ఏం చేయాలంటే.. ఒక బకెట్ ని కానీ టబ్ ని కానీ తీసుకుని అందులో నీళ్లు వేయండి.
వాషింగ్ పౌడర్ని అవసరమైనంత వేయండి రెండు చెంచాల కాస్టిక్ సోడా కూడా వేయండి. చెక్క కర్ర సహాయంతో మీరు దీన్ని బాగా మిక్స్ చేయండి దీనిలో బట్టలును ముంచేసి మూడు గంటల పాటు అలా వదిలేయండి తర్వాత నీళ్లలో వేసి బట్టల్ని ఒకసారి జాడించండి. కొత్త వాటిలా మెరిసిపోతాయి పసుపు రంగు మరకలు వంటివి కూడా పోతాయి ఇలా ఈజీగా మీరు బట్టల్ని మళ్లీ తెల్లగా మార్చుకోవచ్చు.