రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ స్మారక నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.1000 నాణాన్ని రాష్ట్రపతి విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ లోని సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించారు. తదనంతరం చంద్రబాబు ఇవాల సీఈసీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న నకిలీ ఓట్ల సమస్యను సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా తాను ఢిల్లీకి రెండు అంశాల పై వచ్చినట్టు గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ తెలుగు వారికే కాకుండా దేశానికి సేవ అందించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పటికీ ..జాతీయ భావాలతో దేశ భిద్దికోసం ఎనలేని కృషి చేశారు. అలాంటి మహానుభావుడి నాణెం విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. దేశం కోసం పని చేసిన వ్యక్తిని గౌరవించడం మన సాంప్రదాయం అన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని కోరారు నారా చంద్రబాబు నాయడు.