సాధారణంగా చాలా మంది పిల్లలకి జన్మనివ్వలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీని వల్ల శారీరకంగా మరియు మానసికంగా కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే బిడ్డకు జన్మనివ్వలేకపోవడం వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. అయితే మంచి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా మంచి జీవన విధానాన్ని పాటించాలి. పోషకాహారం తీసుకోవడం, బరువు కంట్రోల్లో ఉంచుకోవడం, వ్యాయామం చేయడం, స్మోకింగ్ చేయకుండా ఉండడం, ఆల్కహాల్ కి దూరంగా ఉండడం, కెఫీన్ ని తగ్గించుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా యోగా కూడా బాగా ఉపయోగపడుతుంది.
ఫర్టిలిటీ(Fertility)ని ఇంప్రూవ్ చేయడంలో యోగా బాగా సహాయపడుతుంది. ఒకవేళ కనుక ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి వెళ్తే యోగా హెల్ప్ చేస్తుంది. శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకుంటుంది.
యోగ ఎలా సహాయం చేస్తుంది..?
రిప్రొడక్టివ్ సిస్టంని బూస్ట్ చేస్తుంది యోగ. కొన్ని యోగాసనాలు మరియు యోగా పోస్టర్స్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ పైన ప్రభావం చూపిస్తాయి. ఇవి బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి. రీసెర్చ్ ప్రకారం ఒత్తిడిని తగ్గించి మంచి నాణ్యమైన జీవితాన్ని యోగ ఇస్తుంది. అలానే హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా ఎన్నో ఉపయోగాలు యోగ ద్వారా మనకి కలుగుతాయి.
ఒత్తిడిని ఎందుకు దూరం చేసుకోవాలి..?
ఒత్తిడి అనేది ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు కార్టిసోల్ మరియు ఆడ్రెనాలిన్ ఒత్తిడిని అందిస్తాయి దీనితో ఎల్ హెచ్ లెవెల్స్ తగ్గిపోయి ఓవాల్యూయేషన్ పై ప్రభావం చూపిస్తుంది. కార్టిసోల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
యోగా చేయడం వల్ల మహిళలకు ఉపయోగాలు:
కొన్ని యోగాసనాలు:
ఉత్తనాసన (standing forward bend)
మలాసనా (Squat or garland pose)
జను శిరసానా (head to knee forward bend)
సేతు బందాసనం (bridge pose)
కాపాలభాతి ప్రాణాయామ
యోగ వల్ల పురుషులకి కలిగే ఉపయోగాలు:
పురుషుల యోగా చేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎండోక్రైన్ గ్లాండ్స్ రెగ్యులేట్ చేస్తుంది. ఇలా యోగాతో పురుషులు కూడా ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు.