పాక్ గెలుపును సెల‌బ్రేట్ చేసుకుంటే దేశ‌ద్రోహం కేసులు..సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..!

-

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భార‌త్ ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆట అన్న త‌ర‌వాత గెలుపు ఓట‌ములు స‌హ‌జం కానీ కొంత మంది కేటుగాళ్లు భార‌త్ ఓట‌మిని సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. పాక్ పై మొద‌టి సారి భార‌త్ ఓడిపోవ‌డంతో కొంత‌మంది స్వ‌దేశీలు ట‌పాసులు పేలుస్తూ సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఆ వీడియాలను సైతం సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రో వైపు పాకిస్థాన్ కు చెందిన కొంత మంది నేత‌లు కూడా నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు.

కాగా అలాంటి వారికి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఓ టీవీ ఇంట‌ర్య్వూ లో పాల్గొన్న యోగి ఆధిత్యానాత్ పాకిస్థాన్ గెలుపును ఎవ‌రైనా సెలబ్రేట్ చేసుకున్న‌ట్టు అయితే అలాంటి వారిపై దేశ‌ద్రోహం కేసులు పెడ‌తామ‌ని హెచ్చించారు. అంతే కాకుండా ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం కార్యాల‌యం కూడా ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version