పెళ్లి పీటలు ఎక్కబోతున్న మనసంతా నువ్వే చిన్నది..!!

-

స్వర్గీయ నటుడు ఉదయ్ కిరణ్ హీరోగా, రీమాసేన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం మనసంతా నువ్వే. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ఈ సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను అంతే బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తూనీగా తూనీగా పాట కచ్చితంగా ఇప్పటికీ ఈ జనరేషన్ వారికి కూడా గుర్తుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు.. ఈ పాటతోనే సినిమా అత్యంత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ పాటలో కనిపించే అమ్మాయి కూడా ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు.. పేరు తెలియకపోయినా పాట వినగానే ప్రతి ఒక్కరికి ఈ చిన్నారి గుర్తుకొస్తుంది. ఇక ఈ చిన్నారి ప్రస్తుతం పెద్దదైపోయింది. హీరోయిన్ కి ఏమాత్రం తగ్గకుండా తన అందం మెయింటెన్ చేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిన్నారి పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక తాజాగా సుహాని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ బ్యూటీని వివాహమాడిన వరుడు ప్రముఖ సంగీతకారుడు, మోటివేషన్ స్పీకర్. ఇకపోతే సుహాని ఇంస్టాగ్రామ్ లో హల్దీ వేడుకల నుంచి వివాహం రిసెప్షన్ వరకు అందుకు సంబంధించిన ప్రతి ఫోటోలను కూడా షేర్ చేసింది . ఇక అభిమానులు ఈ ఫోటోలు చూసి సుహాని చాలా అందంగా ఉంది అంటూ తెగ పొగిడేస్తున్నారు. అంతేకాదు ఈడు జోడు బాగుంది అని నూతన జంట పై అభినందనల వర్షం కురిపించడమే కాకుండా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.

ఇకపోతే మనసంతా నువ్వే సినిమా ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న సుహాని.. ప్రేమంటే ఇదేరా, గణేష్ , ఎలా చెప్పను వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఈమె హీరోయిన్ గా కూడా కొన్ని చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. మరి సుహాని తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెడుతుందా లేక వైవాహిక బంధం తోనే ఇండస్ట్రీకి దూరం అవుతుందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version