రీజనింగ్ లో మంచి రిజల్ట్ రావాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..!!

-

ఇప్పుడు ప్రతి ఒక్క ఎగ్జామ్ కు రీజనింగ్ తప్పనిసరిగా ఉంటుంది.. ముఖ్యంగా బ్యాంక్ జాబ్స్ కు సెలెక్ట్ అవ్వాలంటే రీజనింగ్ లో మంచి మార్కులు రావాలి.ఐబీపీఎస్ పరీక్ష రాసే అంత వరకు మిస్టేక్ బుక్ ను మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో టాపిక్ కు ఒక్కో టాపిక్ టెస్టు రాసి దాన్ని పూర్తిగా నేర్చుకున్న తర్వాతనే వేరొక టెస్టు టాపిక్ కు వెళ్లాలి. ఇలా టాపిక్ వైస్ టెస్టులు రాసి. వాటిలో మిస్టేక్ అయినా ప్రశ్నలను నోట్ చేసుకోవాలి. ప్రతిసారి టెస్టులు రాసే ముందు మిస్టేక్ బుక్ రిఫర్ చేయాలి. మళ్లీ పొరబాటు రాకుండా జాగ్రత్తగా చదువుకోవాలి. ఇనిక్వాలిటిస్ ని బాగా నేర్చుకోవాలి. శిలాజిజమ్స్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్స్ ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది.

రాంగ్ నంబర్ ను ఐడెంటిఫై చేయయం, మిస్సింగ్ నంబర్ ను కనుక్కోవడం నేర్చుకోవాలి. ఈ నంబర్ సిరీస్ ను స్క్వయర్ నంబర్, క్యూబ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్ మీద గ్రిప్ పెంచుకోవాలి. ఇనిక్వాలిటీస్ ని ప్రశ్న చూసిన వెంటనే బదులు రాసేలా ప్రిపేర్ అవ్వాలి. ఇనిక్వాలిటీస్ ని నేర్చుకోవాలంటే వివిధ రకాల సాధనాలు ఉన్నాయి. మనం ఎంచుకొనే మార్గం ద్వారానే సులభంగా సాల్వ్ చేసేదై ఉండాలి. నంబర్ సిరీస్ రెండు విధాలుగా ఉంటాయి. కొన్ని నంబర్లు ఇచ్చి దానికి క్వశన్ మార్క్(?) ఇవ్వడం జరుగుతుంది. ఈ సీక్వెన్స్ లో ఆరవ నంబర్ ఏమి వస్తుందని అడుగుతారు. ఆరు నంబర్లు ఇచ్చి రెండవ నెంబర్ వద్దే క్వశన్ మార్క్(?) ఇచ్చే అవకాశం ఉంటుంది..

మరి కొన్ని సార్లు పూర్తి నెంబర్ ఇచ్చి అందులో రాంగ్ నెంబర్ ఏంటని అడుగుతారు.నంబర్ సిరీస్ లోనే లేటర్ సిరీస్ ఉంటుంది. ఇది కూడా నెంబర్ సిరీస్ ను పోలి ఉంటుంది. అన్ని లేటర్ లకు నంబరింగ్ వేసుకోవాలి. కన్సోనెంట్స్, ఓవెల్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇలా ఈజీ మెథడ్ లో నుంబర్ సిరీస్ నేర్చుకోవచ్చు. ఇక వీటిని నేర్చుకోకుంటే అనాలజీ చాలా ఈజీగా ఉంటుంది. శిలాజిజమ్స్ నేర్చుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి వెన్ డైయాగ్రమ్ ద్వారా చేయవచ్చు. రెండవది వివిధ రకాల ఫార్ములా ద్వారా చేయవచ్చు. రెండు మెథడ్ లోను సమాధానాలను త్వరగా పూర్తి చెయ్యవచ్చు.ఒకవేళ పరీక్ష సమయంలో ఫార్ములాస్ గుర్తు రాకపోవచ్చు. అదే వెన్ డైయాగ్రమ్ అయితే మనకు గుర్తు ఉండిపోతుంది. ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి దాని పజిల్ రూపంలో ఇస్తారు. ఇందులో మూడు ప్రశ్నలు ఉంటాయి.వాటిని రెఫర్ చేస్తున్న సమయంలోనే ఆన్సర్ చెయ్యాల్సి ఉంటుంది.ఒక్కో వార్డ్ కి ఒక్కో కోడింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆలా నాలుగు పదాలు ఇస్తారు. అందులో కామన్ గా ఉన్న పదాల ఆధారంగా కోడింగ్ డీకోడింగ్ చేయాలి.పైన తెలిపిన విధంగా ఎగ్జామ్ లో రాస్తే మంచి రిజల్ట్ రావడం పక్కా..ఆల్ ది బెస్ట్..

Read more RELATED
Recommended to you

Exit mobile version