కాళ్ళ కింద ఎత్తుగా వాడుకున్న రాయి విలువ చూస్తే షాక్ అవ్వాల్సిందే…!

-

గుర్రపు స్వారీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అలానే ఒక యువతికి కూడా గుర్రపు స్వారీ అంటే బాగా ఇష్టం కానీ ఆమెకి అస్తమాను గుర్రం ఎక్కడం కష్టం అయిపోయేది. అందు కోసం ఆమె కొంచెం హైట్ గా ఏమైనా పెట్టి ఎక్కాలని అనుకుంది. ఇలా ఆమె పెరట్లో పడిపోయిన ఓ మార్బుల్ స్లాబ్ ముక్కను తెచ్చుకొని తన కాళ్ల కింద వేసుకుంది. దీని తో ఆమె కి గుర్రం ఎక్కడం సులభం అయ్యింది. ఇలా ఆ రాయి ఆమెకు సరిగ్గా సరిపోయింది. ఇలా ఆమె తరచూ ఇదే ఉపయోగించేది.

stone

దాదాపు 20 ఏళ్లు దాటిపోయింది ఈమె ఇలా మొదలు పెట్టి. అప్పటి నుంచి ఆమె ఈ రాయిని అలా గుర్రం ఎక్కడానికే ఉపయోగిస్తోంది. బ్రిటన్ ‌లోని వైట్‌పారిష్ గ్రామానికి చెందిన ఆ యువతి ఒక నాడు ఆ రాయి పై ఏదో బొమ్మ ఉండటం గమనించింది. ఆమె దానిని చూడటంతో అనుమానం వచ్చింది. ఆర్కియాలజీ డిపార్టుమెంటుకు కూడా రాయని తీసుకుని వెళ్లింది.

ఆ రాయని చూసిన ఆర్కియాలజిస్టులు ఆశ్చర్యపోయారు. దాదాపు 200వ సంవత్సరం కాలానికి చెందిన రాయని వాళ్లు గుర్తించారు. ఆ రాయి గ్రీసు దేశం లేదా ఆసియా లో నుండి వచ్చి ఉండవచ్చన్నారు. ఇంతకీ ఆ రాయి ధర ఎంతో తెలుసా..? 20వేల డాలర్ల పైగానే ఉండొచ్చని అంటున్నారు. ఒకవేళ దీనిని వేలం వేస్తె 15 లక్షల రూపాయల వరకూ ధర రావచ్చన్నారు. ఇది తెలిసిన ఆమె షాక్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version