ఏపీలోని తాడిపత్రి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని నందలపాడులో గల చర్చి భవనం పై నుంచి కిందపడి యువకుడు మృతి చెందాడు. అతను కింద పడగానే పక్కనే కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకుంటున్న వ్యక్తులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
తీవ్రగాయాలైన వ్యక్తిని విక్టర్‌గా గుర్తించారు.. అయితే, అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. ఇదిలాఉండగా, మృతుడు విక్టర్‌కు మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు.అయితే, అతను చర్చి పైకి ఎందుకు ఎక్కాడు. తానే కిందకు దూకాడా? ప్రమాదవశాత్తు పడిపోయాడా? ఎవరైనా తోసేసారా? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.