తెలంగాణలో వాహనదారులకు షాక్ తగిలింది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు అంటూ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. 2019కి ముందు బండి అయితే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. బైకులకు రూ.320 నుండి రూ.500 వరకు.. ఆటోలకు రూ.350 నుండి రూ.450 వరకు.. కార్లకు రూ.590 నుండి రూ.860 వరకు ఉంటుంది.
కమర్షియల్ వాహనాలకు రూ.600 నుండి రూ.800 వరకు నంబర్ ప్లేట్ రేట్లు ఉంటాయి. వాహనానికి సెప్టెంబరు 30లోగా నంబర్ ప్లేట్స్ బిగించుకోవాల్సిందే. లేదంటే వాహనాన్ని అమ్మడానికి, కొనడానికి.. వాహనంపై ఇన్సూరెన్స్, పొల్యూషన్ వర్తించవు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు లేకుండా వాహనం రోడ్లపై తిరిగితే పట్టుకోవాలని పోలీసులకు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేస్తారు. ఈ నంబర్ ప్లేట్స్ కోసం వాహనం ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా ఉండాలి.