చేపల వేటకు వెళ్లి.. పాలేరు వాగులో చిక్కుకున్న యువకుడు

-

మహబూబాబాద్‌ జిల్లాలోని పాలేరు వాగులో యువకుడు చిక్కుకుపోయాడు. జిల్లాలోని దంతాలపల్లి మండలం రామవరం శివారులోని వాగులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారిలో గుగులోత్‌ సురేష్‌ సురక్షితంగా బయటపడగా.. మరో యువకుడు యాకేష్‌ (18) వాగులో చిక్కుకుపోయాడు.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. యాకేష్‌ను రక్షించేందుకు గ్రామస్థుల సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చివరకు తాడు సాయంతో యాకేశ్‌ను బయటకు లాగారు.

మరోవైపు.. జనగామ జిల్లా దేవరప్పుల మండలం పెద్దమడూరు వాగులో చిక్కుపోయిన నలుగురు రైతులను గ్రామస్తులు, సహాయక బృందాలు రక్షించాయి. వ్యవసాయ పనులకోసం వెళ్లి తిరిగి వస్తుండగా భారీగా కురిసిన వర్షంతో వాగు పొంగింది. వాగులోంచి వచ్చేందుకు ప్రయత్నించిన నలుగురు రైతులు వరద ఉద్ధృతికి కొట్టుకుని పోతూ చెట్లను పట్టుకున్నారు.

దీంతో విషయం తెలిసిన గ్రామస్థులు.. జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారిని కాపాడాల్సిందిగా మంత్రి ఆదేశించడంతో.. పోలీసు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు రెండు గంటలపైగా శ్రమించి.. తాళ్ల సాయంతో వారిని అర్ధరాత్రి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం నుంచి కాపాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version